Corona Virus: కరోనా వైరస్‌ దాడి కన్నా దీని వల్లే ప్రపంచంలో మృతుల సంఖ్య పెరిగింది: నాగబాబు

  • కరోనా వైరస్‌ భయం వల్లే మృతులు పెరిగారన్న నాగబాబు
  • పలు రకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
  • 'కరోనా స్పెల్లింగ్‌ తప్పుగా రాశారు.. సరి చేయండి' అని ఒకరు రిప్లై 
the death rate increased in the world due to corona  virus FEAR

చైనాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య మరింత పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఇరాన్‌, ఇటలీలోనూ ఆ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. చైనాలో కరోనా మరణాల సంఖ్య 3097కు చేరగా, ఇటలీలో 233, ఇరాన్‌లో 194 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు.

'కరోనా వైరస్‌ దాడి కన్నా ఆ వైరస్‌ భయం వల్లే ప్రపంచంలో మృతుల సంఖ్య పెరిగిపోయింది' అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'కరోనా స్పెల్లింగ్‌ తప్పుగా రాశారు.. సరి చేయండి' అని ఒకరు రిప్లై ఇచ్చారు. 'ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ' అంటూ మరొకరు కామెంట్ చేశారు.

More Telugu News