Shiva Karthikeyan: ఉత్కంఠను పెంచుతున్న 'శక్తి' ట్రైలర్

Shakthi Movie trailer released
  • తమిళంలో సక్సెస్ ను సాధించిన 'హీరో'
  • తెలుగులోకి 'శక్తి' గా అనువాదం 
  • ఈ నెల 20వ తేదీన విడుదల
తమిళంలో శివకార్తికేయన్ కి మంచి క్రేజ్ వుంది. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా క్రితం ఏడాది ఆయన చేసిన 'హీరో' సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన 'శక్తి' టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'.. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే' .. వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. అవినీతిని .. అక్రమాలను అంతమొందించడానికి ఒక సాధారణ యువకుడు సూపర్ హీరోలా ఎలా మారాడనేదే ఈ సినిమా కథగా కనిపిపిస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అర్జున్ కీలకమైన పాత్రను పోషించాడు.
Shiva Karthikeyan
Kalyani Priyadarshan
Shakthi Movie

More Telugu News