Chiranjeevi: చిరంజీవిగారు కాబట్టే ఆ సాంగ్ చేశాను: రెజీనా

I did this song only due to Chiranjeevi says Regina Cassandra
  • చిరంజీవి 152వ చిత్రంలో స్పెషల్ సాంగ్
  • మెగాస్టార్ తో కలిసి చిందేసిన రెజీనా
  • ఈ పాటను ఐటెం సాంగ్ అని పిలవొద్దని కోరిన రెజీనా
చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా నటించింది. దీనిపై రెజీనా మాట్లాడుతూ, తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... ఇక చిరంజీవిగారితో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటానని చెప్పింది. చిరంజీవిగారు కాబట్టే రెండో ఆలోచన లేకుండా 'ఓకే' చెప్పానని తెలిపింది. ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని... చిరంజీవిగారి డ్యాన్స్ తనలో చాలా స్ఫూర్తిని నింపిందని చెప్పింది.

తన డ్యాన్స్ ను చిరంజీవిగారు మెచ్చుకున్నారని... ఆయన నుంచి అభినందనలు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని రెజీనా తెలిపింది. అయితే తన సాంగ్ ను ఐటెం సాంగ్ అని పిలవొద్దని, సెలబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది. ఇలాంటి స్పెషల్ సాంగ్ ను చేయడం ఇదే తొలిసారని... ఇదే చివరిసారి కూడా అని చెప్పింది. ఇకపై ఇలాంటి సాంగులు చేయనని తెలిపింది.
Chiranjeevi
Regina Cassandra
Tollywood
152 Movie
Acharya Movie
Special Song
Item Song

More Telugu News