Narendra Modi: రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకండి: మోదీకి కౌంటర్ ఇచ్చిన ఎనిమిదేళ్ల బాలిక

  • వాతావరణ కాలుష్యంపై పోరాడుతున్న లిసీప్రియా కంగుజం
  • లిసీప్రియాను ప్రశంసిస్తూ మోదీ ట్వీట్‌ 
  • మోదీకి అనుకూలంగా తాను పనిచేయలేనని లిసీప్రియా కౌంటర్
  • కాంగ్రెస్‌ పార్టీపై కూడా విమర్శలు
Licypriya Kangujam on modi tweet

లిసీప్రియా కంగుజం (8) వాతావరణ కాలుష్యంపై అతి చిన్న వయసులోనే అవగాహన కల్పించడానికి కంకణం కట్టుకుంది. ఈ మణిపూర్‌ అమ్మాయి ‘గ్రెటా థన్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. ఆమెను కీర్తిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సాధారణంగా మెచ్చుకుంటే ఎవరైనా సంబరపడిపోయి థ్యాంక్స్‌ చెబుతారు. అయితే, లిసీప్రియా మాత్రం మోదీపై మండిపడింది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లిసీప్రియాను ప్రశంసిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఉపయోగించుకోవాలని చూడొద్దని కోరింది. మోదీకి అనుకూలంగా తాను పనిచేయలేనని పేర్కొంది.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ... వాయు కాలుష్యాన్నితగ్గించేందుకు  తాను మూడేళ్లుగా జాతీయ వాయుశుద్ధి విధానం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ పార్టీ మొదటి ప్రాధాన్యత ఇదేనని తెలిపారు. అలాగే, కేవలం మాటలకే మోదీ పరిమితమని, ఈ విధానాలను పర్యావరణ కార్యకర్త లిసీప్రియా కంగుజం తిరస్కరించిందని కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది.

వీటిపై లిసీప్రియా స్పందిస్తూ.. తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రశంసిస్తున్నానని తెలిపింది. అయితే, తన పట్ల కాంగ్రెస్ సానుభూతి ప్రదర్శించిందని, అయితే, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు తన డిమాండ్లను వినిపిస్తున్నారని ప్రశ్నించింది.

More Telugu News