Maruti Rao: బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్... మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్!

Maruti Rao Died Due to Brain Dead and Cardiac Arrest
  • శరీరంపై ఎటువంటి గాయాలూ గుర్తించలేదు
  • మృతదేహం రంగు మారడానికి కారణం విషమే
  • రక్త ప్రసారం ఆగి చనిపోయాడన్న వైద్యులు
నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆయన శరీరంపై ఎటువంటి గాయాలనూ వైద్యులు గుర్తించలేదని తెలుస్తోంది.

బ్రెయిన్ డెడ్, గుండెపోటు కారణంగా ఆయన మరణించారని, విషం తీసుకోవడమే ఇందుకు కారణమని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొంది. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
Maruti Rao
Postmartam
Report
Doctors

More Telugu News