Mumbai: బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తలుపుకొట్టిన తల్లి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన బాలిక!

Girl jumped from first floor after mother came home as she is with boy friend
  • ముంబైలోని కుర్లాలో ఘటన
  • బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకున్న బాలిక
  • యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో ఉండగా తల్లి రావడంతో ఏం చేయాలో పాలుపోని బాలిక మొదటి అంతస్తు నుంచి దూకేసింది. ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం కుర్లా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌ (20)ను పిలిచింది. అతడు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా తల్లి వచ్చి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు.

తల్లి చూస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించిన బాలిక బెడ్ రూములోని కిటికీ నుంచి అమాంతం కిందికి దూకేసింది. యువకుడు మాత్రం అక్కడి నుంచి జారుకున్నాడు. కిందపడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Mumbai
Kurla
Boy friend
Girl
Crime News

More Telugu News