Priyanka Gandhi: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​పై ప్రియాంక గాంధీ విమర్శలు

  • సీసీఏ వ్యతిరేక అల్లర్ల కేసు నిందితుల ఫొటోలతో లఖ్‌నవ్‌లో హోర్డింగ్స్  ఏర్పాటు చేసిన అధికారులు
  • తప్పుపట్టిన ప్రియాంక గాంధీ
  • రాజ్యాంగం కంటే తామే ఎక్కువ అనుకుంటున్నారని యోగి, అధికారులపై ఆగ్రహం
  • హోర్డింగ్స్ ఏర్పాటును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
Priyanka Gandhi slams Yogi Adityanath over hoardings

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. సీసీఏ వ్యతిరేక ఆందోళనల్లో తలెత్తిన హింసలో నిందితులుగా ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలు, వివరాలతో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. లఖ్‌నవ్‌లోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ప్రియాంక.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, యోగి అడుగు జాడల్లో నడుస్తున్న అధికారుల తీరు చూస్తుంటే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కంటే తామే ఎక్కువ అని అనుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదని  రాష్ట్ర హైకోర్టు యూపీ ప్రభుత్వ అధికారులకు ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కాగా, హోర్డింగ్స్ ఏర్పాటును అలహాబాద్ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం ఈ కేసును విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా మెజిస్ట్రేట్, లఖ్‌నవ్‌ డివిజనల్ పోలీస్ కమిషనర్‌‌కు సమన్లు జారీ చేసింది.

More Telugu News