T20 World Cup: టీ20 ప్రపంచకప్​ పైనల్..​ టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా

  • మార్పు ల్లేకుండానే బరిలోకి రెండు జట్లు
  • ఆకట్టుకున్న ఆమెరికా పాప్ స్టార్‌‌ కేటీ పెర్రీ లైవ్ పెర్ఫామెన్స్ 
  • మ్యాచ్‌ భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు
t20 world cup final Australia have won the toss and will bat first

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ తుది జట్లలో మార్పులు లేవు. సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగుతుండగా.. గ్రూప్‌ దశలో విన్నింగ్ కాంబినేషన్‌ను భారత్ కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, టాస్ నెగ్గితే తాను కూడా బ్యాటింగ్‌ కే మొగ్గు చూపేదాన్ని అని హర్మన్‌ తెలిపింది.

కాగా, టాస్ అనంతరం మెల్‌ బోర్న్ క్రికెట్ స్టేడియంలో అమెరికా పాప్ సింగర్‌‌ కేటీ పెర్రీ ఇచ్చిన లైవ్‌ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. అలాగే, భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసింది. ఈ టోర్నీలో భారత్ మొదటి ఫైనల్ ఆడుతుండగా... ఆస్ట్రేలియా ఆరోసారి ఫైనల్ బరిలో నిలిచింది. భారత మహిళల జట్టు ఇప్పటిదాకా ఒక్క వరల్డ్ కప్ కూడా నెగ్గలేదు. ఈసారి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.

More Telugu News