Corona Virus: ట్రంప్ సమావేశానికి హాజరైన వ్యక్తికి కరోనా

one of the attendees of trump meeting tested positive for coronavirus
  • గత నెల చివరి వారంలో ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు
  • సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్థారణ
  • అతను ట్రంప్‌ను తాకలేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్న శ్వేత సౌథం

కరోనా వైరస్ ఎఫెక్ట్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తాకింది. ట్రంప్ పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో, శ్వేత సౌథం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో గత నెల చివరి వారంలో ‘ది కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్’ను నిర్వహించారు.

దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, ఉపాధ్యక్షుడు మైక్ పెప్స్‌తో పాటు క్యాబినెట్ సభ్యులు, శ్వేతసౌథం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ కావడం అలజడి సృష్టించింది. అయితే, బాధిత వ్యక్తి ట్రంప్, పెన్స్‌ను కలువలేదని గుర్తించడంతో అధికారులు ఊపిరిపీల్చుచుకున్నారు.

  • Loading...

More Telugu News