Corona Virus: చైనాలో మరో ఘోరం.. కుప్పకూలిన ‘కరోనా’ హోటల్.. శిథిలాల కింద 70 మంది!

Dozens trapped as China Corona Hotel Collapsed
  • ఆసుపత్రిగా మార్చిన అధికారులు
  • కరోనా బాధితులకు ప్రత్యేక చికిత్స
  • 34 మందిని రక్షించిన అధికారులు
కోవిడ్-19 బాధితులతో నిండిపోతున్న చైనాలో మరో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందిస్తున్న హోటల్ కుప్పకూలింది. శిథిలాల కింద 70 మంది వరకు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాంఝౌ నగరంలో ఉన్న ఈ హోటల్‌ను అధికారులు ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ సోకిన రోగులను ఇక్కడికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 34 మందిని రక్షించినట్టు తెలుస్తోంది. జూన్ 2018లో ప్రారంభించిన ఈ ఐదంతస్తుల ఝింజియా హోటల్‌లో 80 గదులు ఉన్నాయి. నిన్న సాయంత్రం హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
Corona Virus
China
Hotel
Collapsed

More Telugu News