Ranveer Singh: నాటి మధురక్షణాలు ‘83’ సినిమాలో పునఃసృష్టి!

Ranveer Singh Recreates Iconic Moment When Kapil Dev Lifted The 1983 World Cup Trophy
  • కపిల్ దేవ్ జీవిత కథతో ‘83’ సినిమా 
  • కపిల్ పాత్రలో నటిస్తున్న రణ్ వీర్ సింగ్ 
  • కప్ అందుకున్న సన్నివేశాల ఫొటోల విడుదల 
1983 వన్డే వరల్డ్ కప్. భారత క్రికెట్ గతినే మార్చిన టోర్నీ అది. అంచనాలే లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ కెప్టెన్సీలోని భారత జట్టు అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలిచింది. ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి, లార్డ్స్ క్రికెట్ స్టేడియం బాల్కనీ లో కపిల్ దేవ్ ప్రపంచ కప్ ను అందుకున్న క్షణాలను ఎప్పుడు తలుచుకున్నా ఉద్వేగం కలుగుతుంది. ఆ మధుర క్షణాలను మరోసారి కళ్లకు కట్టేందుకు ‘83’ సినిమా రాబోతోంది.

కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. 1983 లో కపిల్ దేవ్ ప్రపంచకప్ అందుకున్న అపురూప ఘట్టాన్ని పున:సృష్టించారు. కపిల్ పాత్రలో రణ్ వీర్ వరల్డ్ కప్ అందుకున్న ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అచ్చం 1983లో కపిల్ కప్పు అందుకున్నట్టుగానే ఉన్న ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. క్రికెట్, బాలీవుడ్ ఫ్యాన్స్ రణ్ వీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు.
Ranveer Singh
83 movie
1983 worldcup
kapildev

More Telugu News