Chandrababu: షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తారా?: చంద్రబాబు

  • ఇంత గజిబిజి ఎన్నికలు ఎప్పుడూ లేవన్న చంద్రబాబు
  • తాడేపేడో తేల్చుకుంటామని స్పష్టీకరణ
  • మనస్సాక్షితో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
Chandrababu fires AP government over local body elections

గతంలో ఎప్పుడూ ఇంత గజిబిజిగా ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. రిజర్వేషన్లు ఇష్టానుసారం ప్రకటించారని మండిపడ్డారు. షెడ్యూల్, నోటిఫికేషన్ అన్నీ ఒకేసారి ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు, నిఘా యాప్ కు ఏమిటి సంబంధం? ఎన్నికలపై నిఘా పెట్టేంత అవసరం ప్రభుత్వానికి ఏంటి? అని ప్రశ్నించారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం చూసుకుంటుందని పేర్కొన్నారు. సూపర్ ఎలక్షన్ కమిషనర్ గా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్వాకం వల్లే బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గాయని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. మద్యం, నగదు పంచుతుంటే ప్రజలే ఎక్కడికక్కడ పట్టించాలని ఉద్బోధించారు. ఒక్క అవకాశం ఇస్తే ఏమయ్యిందో 10 నెలలుగా చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి మనస్సాక్షితో ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.

More Telugu News