Sudha: కేరక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్లెప్పుడూ నాకు సమానం కాలేరు!: సీనియర్ నటి సుధ

Actress Sudha
  • నాకు వాళ్లు పోటీ అనుకోవడం లేదు
  • నటిగా నాకంటూ ఒక రికార్డు వుంది 
  • పొగరనుకున్నా ఫరవాలేదన్న సుధ
కేరక్టర్ ఆర్టిస్టుగా సుధ ఎన్నో చిత్రాల్లో నటించారు. అగ్రస్థాయి హీరోలతో కలిసి నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో వున్నాయి. అలాంటి సుధ మాట్లాడుతూ .. "ప్రగతి .. పవిత్ర లోకేశ్ వచ్చిన తరువాత సుధకి అవకాశాలు తగ్గాయనే విమర్శలు వినిపిస్తున్నాయి .. అలాంటిదేం లేదు. ప్రాధాన్యత లేని పాత్రలను చేయనని నేనే చెబుతున్నాను.

చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున కుటుంబాలకి చెందిన 3 తరాల ఆర్టిస్టులతో కలిసి నేను పనిచేశాను .. అది నా రికార్డు. అలాంటి రికార్డు ప్రగతికి ఉందా? పవిత్ర లోకేశ్ కి వుందా? ఎనో విజయవంతమైన సినిమాలు .. చెప్పుకోదగిన పాత్రలను నేను చేశాను. ప్రగతిగానీ .. పవిత్ర లోకేశ్ గాని ఒక వస్తువులా సీన్లో నుంచునే పాత్రలను చేస్తున్నారు. అలాంటి పాత్రలను చేస్తున్నవాళ్లను చూసి నాకు జాలి అనిపిస్తోంది. కేరక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్లెప్పుడూ సుధకి సమానం కాలేరు. పొగరనుకున్నా ఫరవాలేదు .. 200 శాతం నిజం చెబుతున్నాను" అని అన్నారు.

Sudha
Pragathi
Pavitra Lokesh

More Telugu News