KCR: నాకే బర్త్​ సర్టిఫికెట్​ లేదు, ఇక మా నాయనది తీసుకురమ్మంటే ఎలా?: సీఎం కేసీఆర్​

  • నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను
  • అప్పుడు దవాఖానాలు లేవు.. నాకు బర్త్ సర్టిఫికెట్ లేదు
  • ‘నువ్వెవరు?’  అని  ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? 
Cm Kcr says  I do nont have my Birth Certificate

దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో ఆందోళన ఉందని, ఇది కేవలం మన రాష్ట్రంలోనే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, సీఏఏ, ఎన్పీఆర్ విషయమై ప్రభుత్వ పాలసీని కేబినెట్లో చెప్పామని, దీనిపై శాసనసభలో తీర్మానం పెట్టి, సమగ్రంగా చర్చించి దేశానికి బలమైన సందేశాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. భారతదేశ గౌరవంతో పాటు ఎన్నో అంశాలతో ఈ విషయం ముడిపడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా బర్త్ సర్టిఫికెట్ల గురించి మాట్లాడిన కేసీఆర్ తన సొంత విషయం ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
‘నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. నువ్వెవరు?  అంటే ఏం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూఫ్?  ఆ కాలంలో పెద్దలు ఊళ్లో ఉన్న అయ్యగారిని పిలిపించి ‘జన్మనామం’ అని రాయించేవాళ్లు. అదే బర్త్ సర్టిఫికెట్. దానికి అఫిషియల్ ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం నా దగ్గర ఉంది. మా వైఫ్ దగ్గర ఉంది. ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాలనా? మాకు 580 ఎకరాల జాగా, పెద్ద బిల్డింగ్ ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి?’ అని ప్రశ్నించారు. దీనికి బదులు నేషనల్ ఐడెంటి కార్డు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

More Telugu News