Ram Gopal Varma: చెన్నకేశవులు భార్యకి సాయం చేయాలని కోరిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma requests for help to Chenna Keshavulu wife
  • నిన్న రాత్రి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రేణుక
  • ఎవరికి తోచిన సాయం వారు చేయాలని కోరిన వర్మ
  • బ్యాంక్ అకౌంట్ నంబర్ షేర్ చేసిన ఆర్జీవీ
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ కు గురైన నిందితుడు చెన్నకేశవులు భార్య నిన్న రాత్రి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో, ఆమెకు సాయం చేయాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. 'చెన్నకేశవులు భార్య రేణుక బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. భవిష్యత్తులో రేపిస్టుల నీడ వారిపై పడకుండా ఉండాలంటే... దయచేసి వారికి ఎవరికి తోచిన సాయం వారు చేయండి' అని ట్వీట్ చేశారు.

యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎసీ కోడ్ ను షేర్ చేశారు. గతంలో చెన్నకేశవులు భార్యను వర్మ కలిసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెకు ఆర్థికసాయం కూడా చేశారు. ప్రస్తుతం ఆయన దిశ ఘటనపై సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Ram Gopal Varma
Tollywood
Chenna Keshavulu
Wife
Renuka
Baby
Help

More Telugu News