MS Dhoni: పవర్ తగ్గలేదు.. ఐదు బంతుల్లో ఐదు సిక్సులు బాదిన ధోనీ.. వీడియో ఇదిగో!

Dhoni hits 5 sixes in 5 balls
  • ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్న ధోనీ
  • ప్రాక్టీస్ లో దుమ్మురేపిన మిస్టర్ కూల్
  • వీడియో షేర్ చేసిన స్టార్ స్పోర్ట్స్ తమిళ్
ధోనీ అంటేనే ధనాధన్. బంతిని అలవోకగా బౌండరీ అవతలికి తరలించడంలో సిద్ధహస్తుడు. 2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ భారత్ తరపున ఆడలేదు. ఆయన కెరీర్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ శకం ముగిసినట్టేనని పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతుండటం తెలిసిందే. అయితే, తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని ధోనీ నిరూపించాడు.

ఐపీఎల్ కోసం ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీ ప్రాక్టీస్ కోసం చెన్నై చేరుకున్నాడు. నిన్న నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 'ఔరా' అనిపించాడు. ధోనీ విశ్వరూపాన్ని స్టార్ స్పోర్ట్స్ తమిళ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.
MS Dhoni
IPL
5 Sixes
5 Balls
Chennai Super Kings

More Telugu News