Rana Kapoor: యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు

ED Raids on Yes Bank Founder Rana Kapoor
  • పలు అభియోగాలు ఎదుర్కొంటున్న రాణా కపూర్
  • డీహెచ్ఎఫ్ఎల్‌కు ఇచ్చిన రుణాలు నిరర్థకంగా మారడం వెనక ఆయన పాత్ర
  • కార్పొరేట్ సంస్థ నుంచి రాణా భార్య ఖాతాల్లో ‘ప్రతిఫలం’
సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రైవేటు రంగ యస్ బ్యాంకు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ డిపాజిట్లపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్న వేళ.. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో నిన్న రాత్రి ఈడీ సోదాలు నిర్వహించింది.

 డీహెచ్ఎఫ్ఎల్‌కు యస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడం వెనక కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. తీసుకున్న రుణాలకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి కొంత సొమ్ము కపూర్ భార్య ఖాతాల్లోకి చేరినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో ఈడీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. యస్ బ్యాంకు ప్రస్తుత పరిస్థితికి ఇది కూడా ఓ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Rana Kapoor
Yes Bank
ED Raids

More Telugu News