Corona Virus: శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో విహార నౌక.. 21 మందికి కరోనా వైరస్

21 stranded on corona virus hit ship
  • గ్రాండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3500 మంది పర్యాటకులు
  • నౌకను తీరానికి తీసుకొచ్చి చికిత్స అందిస్తామన్న మైక్ పెన్స్
  • ప్రపంచవ్యాప్తంగా 3400 మందిని బలిగొన్న ప్రాణాంతక వైరస్
గ్రాండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ప్రయాణికుల్లో 21 మందికి కరోనా వైరస్ సోకినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో తీరంలో ఉన్న ఈ నౌకలో మొత్తం 3500 మంది ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 21 మందిలో కరోనా వైరస్ వున్నట్టు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని పెన్స్ తెలిపారు. నౌకను తీరానికి తీసుకొచ్చి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు.

కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3400 మంది మృతి చెందగా, లక్షకుపైగా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 55,800 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక భారత్‌లో ఇప్పటి వరకు 31 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.
Corona Virus
America
California
grand princess cruise ship

More Telugu News