Mukesh Singh: నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తన లాయర్లపైనే కోర్టుకెక్కిన దోషి ముకేశ్ సింగ్

  • వారు నన్ను మోసం చేశారు
  • కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు
  • దర్యాప్తునకు ఆదేశించండి
Nirbhaya Case Convict Mukesh Singh files Curetive petition

నిర్భయ దోషి ముకేశ్ సింగ్ మరోమారు కోర్టుకెక్కాడు. అయితే, ఈసారి ఉరిశిక్ష అమలును నిలిపివేయమనో, ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చమనో కాదు. తన లాయర్లపైనే ఆరోపణలు చేశాడు. వారు తనను తప్పుదారి పట్టించారని, చట్టపరంగా తనకుండే అవకాశాలను మళ్లీ వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముకేశ్ తరపున ఎంఎల్ శర్మ అనే న్యాయవాది క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సర్కారు, అమికస్ క్యూరీగా వ్యవహరించిన వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడి తనను మోసం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

More Telugu News