Rahul Gandhi: రాహుల్ గాంధీకి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు... ఆలస్యంగా వెల్లడించిన కాంగ్రెస్

Corona screening for Rahul Gandhi at Delhi airport
  • ఇటలీ పర్యటన నుంచి తిరిగొచ్చిన రాహుల్
  • ఈ నెల 29న ఢిల్లీకి రాక
  • సాధారణ పౌరుడిలా క్యూలో నిల్చుని కరోనా పరీక్షలు చేయించుకున్న వైనం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29న కరోనా ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ ఇటీవలే ఇటలీ నుంచి భారత్ తిరిగొచ్చారని, అయితే కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో రాహుల్ కు స్క్రీనింగ్ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇటలీలోని మిలాన్ లో పర్యటించిన అనంతరం రాహుల్ ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకోగా, లోక్ సభ ఎంపీగా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిగా సులభమార్గంలో ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వచ్చే వీలున్నా, రాహుల్ గాంధీ సాధారణ పౌరుడిలా క్యూలో నిల్చుని కరోనా పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
Rahul Gandhi
Corona Virus
Screening
Delhi
Airport
Italy
Congress

More Telugu News