Election commissioner: ఏపీలో రాజకీయపార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్​ భేటీ

  • విజయవాడలోని ఈసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం
  • వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల నేతల హాజరు
  • టీడీపీ నుంచి హాజరైన వర్ల రామయ్య, ఆలపాటి రాజా
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఇవాళ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలు జోగి రమేశ్, అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, జనసేన పార్టీ నుంచి వెంకట మహేశ్, బీజేపీ నుంచి నాగభూషణం, సీపీఎం, సీపీఐల తరఫున వరుసగా వైవీ రావు, జెల్లి విల్సన్ లు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయా పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
Election commissioner
Andhra Pradesh
Ramesh kumar
Vijayawada

More Telugu News