PV Sindhu: బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఖాతాలో మరో పురస్కారం

  • సింధుకు టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డు
  • 2019కి గాను మేటి క్రీడాకారిణిగా ఎంపికైన సింధు
  • గతేడాది వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సింధుకు స్వర్ణం
  • ఆ పతకం నెగ్గిన తొలి భారత షట్లర్ గా రికార్డు
Badminton star PV Sindhu wins TOI sports award

భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ క్రీడాకారిణి పురస్కారం సొంతం చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో భాగంగా సింధును ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. గత రాత్రి ఢిల్లీలో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో సింధుకు ఈ అవార్డు ప్రదానం చేశారు.

గతేడాది సింధు కెరీర్లోనే అత్యుత్తమం అని చెప్పాలి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి ఆ ఘతన సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. కాగా, సింధుకు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకునే క్రమంలో సింధుకు రోహిత్ శర్మ (క్రికెట్), భజ్ రంగ్ పునియా (రెజ్లర్), వినేశ్ ఫోగాట్ (రెజ్లర్), అమిత్ పంఘాల్ (బాక్సర్), సౌరభ్ చౌదరి (షూటర్), మను భాకర్ (షూటర్) నుంచి గట్టిపోటీ ఎదురైంది.

More Telugu News