Madhav: ఆ పదవి నుంచి సంచయితను తొలగించాలి: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్​

BJP MlC Madhav criticises sanchaita
  • సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయితపై సొంత పార్టీ నేత విమర్శలు 
  • అశోక్ గజపతిరాజుకు ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు
  • బీజేపీ అధిష్ఠానానికి ఓ లేఖ రాస్తాం
విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ను రాత్రికి రాత్రే మారుస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సంచయితను చైర్ పర్సన్ గా నియమించడంపై విమర్శలు చేశారు. అశోక్ గజపతిరాజుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. చైర్ పర్సన్ పదవి నుంచి ఆమెను తొలగించాలని కోరుతూ బీజేపీ అధిష్ఠానానికి ఓ లేఖ రాస్తామని చెప్పారు. కాగా, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సంచయితపై ఆ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Madhav
BJP
Simhachalam
Devastanam
chairperson
Sanchaita

More Telugu News