Rahul Gandhi: ఎస్‌ బ్యాంక్‌ పరిణామాలపై రాహుల్ గాంధీ, చిదంబరం ఆందోళన

rahul on yes bank
  • కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు
  • భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నారు
  • మోదీ విధానాలే కారణం 
ఎస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇది ఎస్‌ బ్యాంక్‌ వైఫల్యం కాదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలే భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  విమర్శించారు.

బీజేపీ ఆరేళ్లుగా అధికారంలో ఉందని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన పరిణామాల వల్ల ఇప్పటికే బీజేపీ పరిపాలన, ఆర్థిక సంస్థల నియంత్రణలో వైఫల్యాలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. ముందుముందు ఇంకా ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

'పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ వైఫల్యం కనపడుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేక ఇటువంటి పరిణామాలు మరికొన్ని చోటు చేసుకుంటాయా? దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ మౌనంగానే ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల మాదిగానే ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు' అని చిదంబరం చెప్పారు.
Rahul Gandhi
Congress
yes bank

More Telugu News