Indira Gandhi: ‘టైమ్స్’ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఇందిరాగాంధీ, అమృత్ కౌర్

  • వందమంది మేటి మహిళల జాబితా విడుదల చేసిన ‘టైమ్స్’
  • 1947వ సంవత్సరానికి అమృత్‌కౌర్..
  • 1976వ సంవత్సరానికి ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’గా ఇందిర ఎంపిక
TIME Magazine names 100 historical women of the year inlcuding Indira Gandhi

ప్రపంచంలోని గత శతాబ్దపు వందమంది శక్తిమంతమైన మహిళల జాబితాలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధురాలు అమృత్‌కౌర్‌లకు టైమ్స్ మ్యాగజైన్ చోటు కల్పించింది. 1947 సంవత్సరానికి గాను అమృత్‌కౌర్‌, 1976 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీని ‘విమెన్ ఆఫ్ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది.

1976లో ఇందిరా గాంధీ ‘ఎంప్రెస్ ఆఫ్ ఇండియా’గా ఉండేవారని కొనియాడింది.  ఆమెలో ఎంత కరిష్మా ఉండేదో, అంత కాఠిన్యం కూడా ఉండేదని తెలిపింది. ఇక, కపుర్తలాలోని రాచకుటుంబంలో జన్మించిన అమృత్ కౌర్.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన బాటలో నడిచినట్టు పేర్కొంది. బాల్య వివాహాలు, వలస పాలన, దురాచారాలపై గళమెత్తారని కీర్తించింది.  దేశానికి స్వాతంత్య్రం  వచ్చిన తర్వాత ఆమె పదేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా పనిచేశారని ‘టైమ్స్’ వివరించింది.

More Telugu News