Tirumala: తిరుమలకు వెల్లువలా భక్తులు... ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

  • వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు
  • వారాంతం కలిసిరావడంతో పెరిగిన భక్తుల సంఖ్య
  • నిన్న దర్శించుకున్న 68 వేల మంది
Heavy Rush in Tirumala

గడచిన నాలుగైదు రోజులుగా వెలవెలబోయిన తిరుమల గిరులు, వారాంతం వచ్చేసరికి ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. నిన్న రాత్రి నుంచి వెల్లువలా భక్తులు రావడంతో, అద్దె గదులకు కొరత ఏర్పడింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 గదుల్లో భక్తులు స్వామి వారి సర్వదర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శనమయ్యేందుకు కనీసం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మిగతా అన్ని రకాల దర్శనాలకూ 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. 

కాగా, తిరుమలలో వెంకన్న తెప్పోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలు నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం పుష్కరిణిలో స్వామివారు శ్రీ కృష్ణుని అవతారంలో విహరించనున్నారు. నిన్న స్వామివారిని సుమారు 68 వేల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 2. 75 కోట్ల మేరకు ఆదాయం లభించింది.

More Telugu News