Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి పాస్‌లు

  • ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి పెరుగుతున్న ఆదరణ
  • ఒకే టికెట్‌పై ఆర్టీసీ బస్సు, ఉబెర్ క్యాబుల్లోనూ ప్రయాణించేలా చర్యలు
  • రైలును ప్రతి రోజూ కెమికల్ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నామన్న ఎండీ
Hyderabad metro launched QR Code ticketing system

మూడు నెలల క్రితం హైదరాబాద్ మెట్రో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ క్యూఆర్ కోడ్ విధానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 60 వేలకు చేరినట్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. పేటీఎం భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానం వల్ల టికెట్ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుందన్నారు. క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఫీడర్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చన్నారు.

భవిష్యత్తులో ఆర్టీసీ, ఉబెర్ వంటి సంస్థలతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుని ఒకే టికెట్‌పై ప్రయాణించే వెసులుబాటును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో పాస్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. అలాగే, కరోనా వైరస్ గురించి మెట్రో ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.  రైలును ప్రతి రోజూ కెమికల్ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News