Mithali Raj: చీరకట్టుతో బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్... వీడియో ఇదిగో!

Mithali bats in saree ahead of T20 World Cup final
  • మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • అదే రోజున భారత్, ఆసీస్ మహిళల జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియాకు స్ఫూర్తినిచ్చేందుకు మిథాలీతో వీడియో రూపకల్పన
భారత్ లో పురుషుల క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను ఎలా ఆరాధిస్తారో, మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ ను అదే స్థాయిలో అభిమానిస్తారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఆట కోసం ఆమె పడని కష్టమంటూ లేదు. ఆఖరికి జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని కూడా పక్కనబెట్టి క్రికెట్టే జీవితంగా శ్వాసించింది. తాజాగా మిథాలీకి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. ఆ వీడియోలో మిథాలీని చీరకట్టులో చూడొచ్చు. అంతేకాదు, చీరకట్టుతో ఆమె బ్యాటింగ్ చేసి నారీ శక్తిని నిరూపించింది.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వీడియో రూపొందించారు. అదే రోజున ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో టీమిండియా, ఆసీస్ మహిళలు టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనున్నారు. ఓ వరల్డ్ కప్ లో భారత్ అమ్మాయిలు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడంతో వారికి స్ఫూర్తినిచ్చేందుకు, కోట్లాదిమందికి ప్రేరణగా నిలిచేందుకు మిథాలీ రాజ్ పైన ప్రత్యేకంగా వీడియో చిత్రీకరించారు.
Mithali Raj
Saree
Batting
Cricket
T20 World Cup
Women
India
Australia
Final

More Telugu News