Eetala Rajender: తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి ఈటల

  • ఇప్పటివరకూ ఈ గడ్డపై ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు
  • ఈ వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందాం
  • అతిగా స్పందించే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి
Minister Eetal Rajender appeals no corona virus in Telangana

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చాలా బాధ్యతతో పని చేస్తోందని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తమ సర్కార్ కు ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతిగా స్పందించవద్దని సూచించారు. హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ లోని కార్యాలయంలో పని చేసే యువతికి ‘కరోనా’ సోకిందని దుష్ప్రచారం చేశారని, ఆమెకు ఈ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.

‘కరోనా’ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం కానీ, అతిగా స్పందించే ప్రయత్నం చేయొద్దని, తద్వారా అనేక దుష్పరిణామాలు తలెత్తే ఆస్కారం ఉందని ప్రజలకు సూచించారు. తెలంగాణలోని ఐటీ ఇండస్ట్రీకి విఙ్ఞప్తి చేస్తున్నానని, ఇప్పటివరకూ ఈ గడ్డపై ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని అన్నారు. దుబాయ్ లో ‘కరోనా’ బారిన పడి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి  గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని
 ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు.

More Telugu News