Revanth Reddy: టీ–కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి అరెస్టు

T congress MP Revanth Reddy Arrest
  • కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసు
  • శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ అరెస్టు
  • నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో టీ–కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రేవంత్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ అనుచరులు నలుగురిని అరెస్టు చేశారు.
Revanth Reddy
Congress
Telangana
KTR
Farm house
Drone
case

More Telugu News