Congress: లోక్ సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

Seven congress MPs suspended from Lok Sabha
  • ఢిల్లీ అల్లర్లపై అట్టుడుకిన లోక్ సభ
  • ఏడుగురు సభ్యులపై బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు
  • రేపటికి వాయిదా పడ్డ లోక్ సభ
లోక్ సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభ నడవకుండా అడ్డు తగలడం, ఆందోళనలు చేయడం వంటి చర్యల నేపథ్యంలో వీరిపై ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, ఆర్ ఉన్నిథాన్, మాణిక్యం ఠాగూర్, బెన్నీ బెహ్నాన్, గుర్జీత్ సింగ్ ఔఝా ఉన్నారు.

వాయిస్ ఓటింగ్ ద్వారా వీరి సస్పెన్షన్ కు సంబంధించిన తీర్మానాన్ని పాస్ చేశారు. కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిన వెంటనే రేపు 11 గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు. ఢిల్లీ అల్లర్లపై ఈరోజు కూడా పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.
Congress
MPS
Suspension
Lok Sabha

More Telugu News