విజయ్ దేవరకొండ జోడీగా ముందుగా దిశా పటానీని అనుకున్నారట

05-03-2020 Thu 15:53
  • సెట్స్ పై పూరి మార్క్ లవ్ స్టోరీ
  • పూరి ఆఫర్ ను తిరస్కరించిన దిశా 
  •  బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
Puri Jagannadh Movie
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా అనన్య పాండే నటిస్తోంది. అయితే అనన్య పాండేను తీసుకోవడానికి ముందు, ఈ పాత్రకిగాను 'దిశా పటానీ'ని తీసుకోవాలని పూరి అనుకున్నాడట. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయట.

దిశా పటానీని 'లోఫర్' చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం చేసిందే పూరి. అందువలన ఆమె కాదనదనే ఉద్దేశంతో సంప్రదింపులు జరిపాడని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తాను చేయలేనంటూ దిశా కొన్ని కారణాలు చెప్పిందని అంటున్నారు. అప్పుడే అనన్య పాండేను తీసుకున్నారట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నది త్వరలోనే చెబుతారట.