Kangana: 'తలైవి' కోసం 100 కోట్ల ఖర్చు .. 4 గెటప్పుల్లో కంగనా!

Thalaivi Movie
  • ఎ.ఎల్. విజయ్ నుంచి 'తలైవి'
  • జయలలిత పాత్రలో కంగనా
  • నమ్మకంతో వున్న నిర్మాతలు  
దివంగత నేత జయలలిత జీవితం చిన్నతనం నుంచి అనేక మలుపులు తీసుకుంటూ సాగింది. ఆమె సినీ జీవితం .. రాజకీయ జీవితం అనేక విశేషాల సమాహారంగా సాగింది. ఎన్నో సమస్యలను ఆమె ఒంటరిగా .. ధైర్యంగా ఎదుర్కొంది. అలాంటి జయలలిత జీవితచరిత్రను దర్శకుడు ఎ.ఎల్. విజయ్ వెండితెరకు ఎక్కిస్తున్నాడు. 'తలైవి' పేరుతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.

ఈ సినిమాలో ప్రధాన పాత్రను కంగనా రనౌత్ చేస్తోంది. జయలలిత పాత్ర కోసం ఆమె తమిళం నేర్చుకుంది. అంతేకాదు .. జయలలిత బాడీ లాంగ్వేజ్ ను చాలా నిశితంగా పరిశీలించింది. జయలలిత 18 వ ఏట నుంచి ఆమె చనిపోయేవరకూ జరిగిన కథలో కంగనా కనిపించనుంది. వయసుపరంగా జయలలితలా నాలుగు దశల్లో .. నాలుగు గెటప్పుల్లో కంగనా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 100 కోట్లను ఖర్చు చేస్తున్నారట. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్న కారణంగా, ఆ పెట్టుబడి ఈజీగానే వెనక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.
Kangana
A.L.Vijay
Thalaivi Movie

More Telugu News