Hyderabad: రూ. 4 కోట్ల విలువైన వెండిని చేబదులుగా తీసుకుని మోసం

  • వ్యాపారం చేసుకుని తిరిగి ఇచ్చేస్తానని 700 కేజీల వెండిని తీసుకెళ్లిన స్నేహితుడు
  • గడువు దాటి నెలలు గడుస్తున్నా చెల్లించని వైనం
  • మరికొందరు నిందితులు ఉన్నారన్న పోలీసులు
Jewellers friend arrested for not return silver as he taken

స్నేహితుడి వద్ద రూ. 4 కోట్ల విలువైన 700 కేజీల వెండి తీసుకుని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. సూరజ్‌భాన్ జువెల్లర్స్ అధినేత అరుణ్‌కుమార్, దినేశ్ జువెల్లర్స్ పార్ట్‌నర్ శైలేశ్ కుమార్ అగర్వాల్ స్నేహితులు. ఏడు నెలల క్రితం అరుణ్‌ను కలిసిన శైలేశ్ కుమార్ వ్యాపారం చేసుకుని తిరిగి ఇచ్చేస్తానంటూ 700 కిలోల వెండిని చేబదులుగా తీసుకెళ్లాడు.

తిరిగి ఇచ్చేందుకు గతేడాది నవంబరు 1వ తేదీ వరకు గడువు పెట్టాడు. అయితే, గడువు దాటి నెలలు గడుస్తున్నా తీసుకున్న వెండిని వెనక్కి ఇవ్వకపోవడంతో అరుణ్ కుమార్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న బంజారాహిల్స్‌లో శైలేశ్ కుమార్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News