Vijay Devarakonda: కాలు జారి పడబోయిన విజయ్ దేవరకొండ... వీడియో ఇదిగో!

Vijay Devarakonda Slips on way
  • 'షూటర్' చిత్రం షూటింగ్ లో ఘటన
  • తొలుత వచ్చి బోట్ ఎక్కిన పూరీ, చార్మి
  • నడుస్తూ కింద పడిన విజయ్
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, షూటింగ్ నిమిత్తం వెళుతూ కాలు జారగా, అతని పక్కనే ఉన్న సహాయకులు, పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ముంబైలోని ఓ హార్బర్ సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది.

షూటింగ్ నిమిత్తం పూరీ జగన్నాథ్, చార్మీ తదితరులు ముందు వచ్చేశారు. వారంతా బోట్ లో ఎక్కి వెళ్లిపోయారు. ఆపై విజయ్ వచ్చాడు. రోడ్డు నుంచి బోట్ వరకూ వచ్చే దారి కాస్తంత ఇరుకుగా, అటూ ఇటూ మరపడవలతో నిండి వుండడంతో, వాటి మధ్య నుంచే షార్ట్, బ్లాక్ టీ షర్ట్ వేసుకుని విజయ్ వచ్చాడు.

బోటు వద్దకు నడుస్తూ వుంటే, అక్కడే ఉన్న అభిమానులు 'విజయ్ అన్నా... విజయ్ అన్నా...' అంటూ హడావుడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. వారి వైపు చూస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వేగంగా నడిచిన విజయ్, ఓ చోట కాలు జారాడు. కింద పడబోతుంటే, అనుచరులు ఒడుపుగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూడవచ్చు.
Vijay Devarakonda
Puri Jagannadh
Charmi
Shooter
Slip

More Telugu News