Luftansa Airlines: 150 విమానాలను రద్దు చేసిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్

  • సుదూర దేశాలకు వెళ్లే 25 విమానాలు రద్దు
  • ఇటలీ సహా కోవిడ్ ప్రభావిత దేశాలకు సర్వీసుల నిలిపివేత
  • 4-5 బిలియన్ డాలర్లు నష్టపోయిన విమానయాన రంగం
Germany Airlines Luftansa suspended 150 flights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా విమానయాన రంగం నష్టాల్లో కూరుకుపోతోంది. కోవిడ్ ప్రభావిత దేశాలకు ఇప్పటికే పలు సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. తాజాగా, ఆ జాబితాలోకి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా చేరింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ 150 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించింది.

సుదూర దేశాలకు వెళ్లే 25 విమానాలతోపాటు మరో 125 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొంది. ఇటలీ సహా కోవిడ్ ప్రభావిత దేశాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, వైరస్ లక్షణాలు బయటపడిన జర్మనీలోని పలు ప్రాంతాలకు కూడా సేవలు ఆపివేసినట్టు వివరించింది. లుఫ్తాన్సా సంస్థకు మొత్తం 770 విమానాలు ఉన్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ వైరస్ కారణంగా విమానయాన రంగం దాదాపు  నాలుగైదు బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్టు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంది.

More Telugu News