Rahul Sipligunj: బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. తీవ్రగాయాలు

BiggBoss 3 Winner Rahul Sipligunj Attacked in Pub
  • రాత్రి 11:45 గంటలకు స్నేహితులతో కలిసి పబ్‌కు
  • రాహుల్ వెంట వున్న యువతిపై అసభ్య ప్రవర్తన
  • నిందితుల్లో ఎమ్మెల్యే సోదరుడు
బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరుబాటిళ్లతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన రాహుల్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి.

ఈ క్రమంలో కొందరు యువకులు రాహుల్‌ తలపై బీరు సీసాలతో దాడికి దిగారు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rahul Sipligunj
Hyderabad
PUB
Attack
Bigg Boss

More Telugu News