మృతి చెందిన జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల మనోహర్
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన
- విశాఖకు చెందిన దువ్వి వెంకటరమణ ఇటీవల మృతి
- పార్టీలో తొలి నుంచి చురుకైన కార్యకర్తగా గుర్తింపు
తొలి నుంచి పార్టీ సైనికునిగా వెంకటరమణ అందించిన సేవలను మననం చేసుకున్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వెంకటరమణ చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారని, ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.