Nikhil: 'కుమారి 21F' దర్శకుడి నుంచి మరో చిత్రం .. హీరోగా నిఖిల్

Surya Prathap Movie
  • గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో చిత్రం 
  •  దర్శకుడిగా సూర్య ప్రతాప్ 
  • త్వరలోనే పూర్తి వివరాలు
గీతా ఆర్ట్స్ 2 వారు అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను నిర్మించారు. వచ్చేనెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, గీతా ఆర్ట్స్ 2 వారు మరో సినిమాను లాంచ్ చేస్తున్నారు. నిఖిల్ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది.

సుకుమార్ కథ - స్క్రీన్ ప్లేను అందించిన ఈ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను రేపు లాంచ్ చేయనున్నారు. టైటిల్ ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నారు. గతంలో సుకుమార్ అందించిన కథాకథనాలతో 'కుమారి 21F' ను సూర్యప్రతాప్ హిట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళుతోంది. నాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? వంటి విశేషాలతో పాటు, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Nikhil
Sukumar
Surya Prathap Movie

More Telugu News