Hyderabad: కరోనా కలకలం: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో భరోసా

Hyderabad Metro Taking Safety Measures about coronovirus
  • కరోనా వైరస్ కలకలంతో మెట్రో అప్రమత్తం
  • స్టేషన్లలో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు
  • ఆందోళన వద్దన్న మెట్రో ఎండీ
హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలకలం రేపిన నేపథ్యంలో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రైళ్లలో అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, రైళ్లలో ప్రజలు తాకే అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాబట్టి మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్వీఎస్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Hyderabad
Hyderabad metro
Corona Virus

More Telugu News