Vakeel Saab: 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్ లతో వకీల్ సాబ్ రికార్డు

Pawan Kalyan new movie Vakeel Saab first look set new record
  • నిన్న పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్
  • హోరెత్తిన ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు
  • రెండేళ్ల తర్వాత కెమెరా ముందుకొస్తున్న పవన్
నిన్న రిలీజైన వకీల్ సాబ్ చిత్రం ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో సునామీ సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా హైప్ ఆకాశాన్నంటుంతోంది. ట్విట్టర్ లో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కు లభిస్తున్న స్పందనే అందుకు నిదర్శనం. కేవలం 24 గంటల వ్యవధిలో 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్ లతో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు మరే ఫస్ట్ లుక్ ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టాలీవుడ్ లో అత్యధికంగా 25.3 వేల సార్లు రీట్వీట్ చేసిన ఫస్ట్ లుక్ కూడా ఇదే.

రాజకీయాల కారణంగా పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత మరో చిత్రంలో నటించలేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంట్లో పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Vakeel Saab
Pawan Kalyan
First Look
Twitter
Record

More Telugu News