Nara Lokesh: నా పర్యటనను అడ్డుకోవడానికి ఇడుపులపాయ దొంగలు వచ్చారు: నారా లోకేశ్​

TeluguDesam Leader Nara Lokesh comments on YSRCP Government
  • నా పర్యటనను అడ్డుకునేందుకు ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు’ వచ్చారు
  • ఇది పులివెందుల, ఇడుపులపాయ కాదు
  • ఇంకోసారి ఇక్కడికి వస్తే, తరిమి తరిమి కొడతాం
తన పర్యటనను అడ్డుకునేందుకు ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు’ వచ్చారంటూ వైసీపీపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రఘుదేవపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఈరోజున ఇక్కడికి తాను వస్తుంటే నలభై మంది ఇడుపులపాయ దొంగలు వచ్చారని, తన పర్యటనను అడ్డుకునేందుకు ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు’ వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘ఇది పులివెందుల, ఇడుపులపాయ‘ కాదని, ఇంకోసారి ఇక్కడికి వస్తే, తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, అందరికీ మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూస్తే ఊరుకోమని వైసీపీ నేతలను హెచ్చరించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ప్రజాసమస్యలను పరిష్కరించండి. అంతేకానీ, టీడీపీ కార్యకర్తలను, నాయకులను అడ్డుకుంటే మేము సహించం‘ అని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Nara Lokesh
Telugudesam
Prajachaitanya yatra
East Godavari District
YSRCP

More Telugu News