Nithin: 'భీష్మ' పది రోజుల వసూళ్లు

  • తొలి ఆటతోనే సక్సెస్ టాక్ 
  •  నైజామ్ లో పది రోజుల వసూళ్లు 8.57 కోట్లు 
  • మరింత పెరగనున్న వసూళ్లు  
Bheeshma Movie

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' చిత్రం, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 10 రోజుల్లో 26.28 కోట్ల షేర్ ను, 44.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ 10 రోజుల్లో ఒక్క నైజాం లోనే ఈ సినిమా 8.57 కోట్లను రాబట్టడం విశేషం. ఎక్కడా బోర్ కొట్టని వినోదం .. ఆసక్తికరమైన మలుపులు .. ఆకట్టుకునే సంగీతం ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఉగాది' వరకూ 'భీష్మ'కి పోటీ ఇచ్చే సినిమాలేవీ బరిలో లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  • Loading...

More Telugu News