Prabhas: ప్రభాస్ పారితోషికం 70 కోట్లు?

Nag Ashwin Movie
  • రాధాకృష్ణ ప్రాజెక్టుతో సెట్స్ పై ప్రభాస్ 
  • నాగ్ అశ్విన్ కి గ్రీన్ సిగ్నల్ 
  • భారీ బడ్జెట్ తో రంగంలోకి
'బాహుబలి' తరువాత హీరోగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వివిధ భాషల్లో ఆయన మార్కెట్ పెరిగిపోయింది .. అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో ఆయన సినిమాలను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేస్తున్నారు. అందుకు తగినట్టుగా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అలా ఆ పద్ధతిలోనే రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమా రూపొందుతోంది. ఆ తరువాత చేయనున్న నాగ్ అశ్విన్ సినిమా కూడా అలాగే నిర్మితం కానుంది.

ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో కాదు, ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రభాస్ అందుకుంటున్న పారితోషికం 70 కోట్లు అని తెలుస్తోంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనీ, లేదంటే అదనంగా ఛార్జ్ చేస్తానని కూడా ప్రభాస్ చెప్పాడట. అన్నిటికీ సిద్ధపడే నాగ్ అశ్విన్ రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు.
Prabhas
Radha Krishna
Nag Ashwin Movie

More Telugu News