Jagan: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించిన సీఎం జగన్‌

  • ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి
  • ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రణకే ఆర్డినెన్స్ తెచ్చాం 
  • రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు
AP CM reviews on Local Bodies election management

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంలను నియంత్రించాలనే ఆర్డినెన్సును తీసుకొచ్చామని, డబ్బు, మద్యం పంపినట్లు రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని, మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ యావత్తు దేశానికే ఆదర్శం కావాలని అధికారులకు సూచించారు.

More Telugu News