Amaravati: అమరావతిపై అంతర్జాతీయ కోర్టులో పిటిషన్.. త్వరలోనే విచారణ ప్రారంభం

  • ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన అమెరికా ఎన్నారైలు
  • పిటిషన్ కు వారంలోగా సీరియల్ నెంబర్ కేటాయించనున్న అంతర్జాతీయ కోర్టు
  • త్వరలోనే విచారణ ప్రారంభం
USA NRIs files a petition in International Court against YSRCP government regarding capital Amaravati

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ది హేగ్ నగరంలోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. అమెరికా ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి నిన్న ఈ పిటిషన్ వేశారు.

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేయాలని... రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాలని పిటిషన్ లో ఎన్నారైలు అంతర్జాతీయ కోర్టుకు విన్నవించారు. వారం రోజుల్లోగా ఈ పిటిషన్ కు సీరియల్ నెంబర్ ను అంతర్జాతీయ కోర్టు కేటాయించనుంది. త్వరలోనే విచారణ ప్రారంభంకానుంది.

మరోవైపు, అమరావతి ప్రాంత రైతులను పోలీసుల సాయంతో వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని... ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళతామని యూఎస్ ఎన్నారైలు తెలిపారు.

More Telugu News