Malaika Arora: కొడుకు, ప్రియుడి​తో కలిసి తల్లి బర్త్​డే వేడుకకు వెళ్లిన మలైకా అరోరా!

Malaika Arora Went To Mom Joyce Birthday With Son Arhaan And Arjun Kapoor
  • తల్లి బర్త్‌ డే పార్టీకి అర్జున్‌ కపూర్‌‌తో జంటగా వచ్చిన మలైకా అరోరా 
  • హాజరైన మలైకా కొడుకు అర్హాన్ కూడా
  • క్రిస్‌మస్‌ వేడుకకు కూడా మలైకా తల్లి ఇంటికి వెళ్లిన అర్జున్‌
తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌‌తో బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రేమలో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. అర్బాజ్‌ ఖాన్‌కు విడాకులిచ్చిన తర్వాత అర్జున్‌తో కలిసి మలైకా ఇప్పటికే చాలా టూర్లకు వెళ్లింది. ఇటీవలి కాలంలో ఇద్దరూ తరచూ డిన్నర్ డేట్లు, ఈవెంట్లలో కనిపిస్తున్నారు.

తాజాగా, సోమవారం రాత్రి ముంబైలో జరిగిన తన తల్లి జోయ్స్‌ అరోరా పుట్టిన రోజు వేడుకకు అర్జున్‌తో కలిసి వచ్చిన మలైకా అందరినీ ఆశ్చర్యపరిచింది. జంటగా వచ్చిన ఈ ఇద్దరి ఎంట్రీ చూస్తే వీళ్లిద్దరి రిలేషన్‌షిప్‌కు మలైకా కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపినట్టు అనిపిస్తోంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే, తన కొడుకు అర్హాన్‌ను కూడా మలైకా ఈ వేడుకకు తీసుకొచ్చింది.

జోయ్స్ అరోరా నివాసంలో జరిగిన ఈ పార్టీకి మలైకా సోదరి అమృత అరోరా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఇదివరకు జోయ్స్‌ ఇంట్లో జరిగిన క్రిస్‌మస్‌ వేడుకకు కూడా మలైకాతో కలిసి అర్జున్‌ కపూర్‌‌ కూడా వచ్చాడు. అలాగే, మలైకా కొడుకు అర్హాన్‌తో కూడా అర్జున్‌ కలివిడిగా ఉంటున్నాడు. తనతో కలిసి లంచ్‌, డిన్నర్‌‌లకు తీసుకెళ్తున్నాడు.
Malaika Arora
Arjun Kapoor
Arhaan
Bollywood

More Telugu News