nagababu: మోదీజీ నిర్ణయం సరైందే: నాగబాబు

Nagababu I think modiji is correct I thought of  follow modiji
  • సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు మోదీ ట్వీట్
  • తాను కూడా మోదీజీని ఫాలో అవ్వాలనుకుంటున్నానన్న నాగబాబు 
  • బైబై అంటూ నెటిజన్ల కామెంట్లు
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... తాను ఈ ఖాతాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని  ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన ప్రకటించారు. దీనిపై జనసేన నేత నాగబాబు స్పందించారు.

'మోదీజీ నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను. నేనూ మోదీజీని ఫాలో అవ్వాలనుకుంటున్నాను' అని ప్రకటించారు. దీనికి 'బై అన్న.. హ్యాపీ' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మోదీజీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కొందరు రిప్లై ఇస్తున్నారు.
nagababu
Janasena
Narendra Modi
BJP

More Telugu News