Ravi Shankar: తెలుగులో మంచి వేషాలు పడలేదు: 'బొమ్మాళీ' రవిశంకర్

  • నటుడిని కావాలనే ఉద్దేశంతో శిక్షణ పొందాను 
  •  చేసిన పాత్రలకి గుర్తింపు రాలేదు 
  • 'ఢమరుకం' నిరాశ పరిచిందన్న రవిశంకర్  
Dhamarukam Movie

నటుడిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 'బొమ్మాళీ' రవిశంకర్ కొనసాగుతున్నాడు. అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకి వచ్చినంత గుర్తింపు, నటుడిగా రాలేదు. తాజాగా 'ఆలీతో సరదగా' కార్యక్రమంలో ఆయన ఆ విషయాన్ని గురించి స్పందించారు.

"నన్ను మంచి నటుడిగా చూసుకోవాలని మా అమ్మగారు అనుకున్నారు. అందువల్లనే నాకు సంగీతం .. డాన్స్ .. ఫైట్స్ .. హార్స్ రైడింగ్ వంటివి నేర్పించారు. ఒక ఆర్టిస్ట్ గా అన్నీ తెలిసుండాలనే ఉద్దేశంతో అప్పట్లోనే అన్నింటిలోను శిక్షణ పొందాను. వేషాలు వచ్చాయి .. చేశాను. కానీ సరైన వేషాలు రాలేదు .. ఆ కారణంగా గుర్తింపు కూడా రాలేదు.

'తొలివలపు'లో ఓ మంచి వేషం వేశాను. నా దురదృష్టం కొద్దీ ఆ సినిమా అంతగా ఆడలేదు. 'ఢమరుకం' సినిమాలో చేసిన విలన్ పాత్ర నాకు మంచి బ్రేక్ ఇస్తుందని అనుకున్నాను .. కానీ అలా జరగలేదు. మా నాన్న ఆ సినిమా చూసి 'చాలా బాగా చేశావురా' అన్నారు. అదే నాకు సంతోషాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు.

More Telugu News