Raviiteja: 1980 నేపథ్యంలో సాగే కథతో రవితేజ

Nakkina Thrinatha Rao Movie
  • 'క్రాక్' షూటింగులో బిజీగా రవితేజ 
  • కామెడీ ఎంటర్టైనర్ గా త్రినాథరావు మూవీ 
  • త్వరలోనే పూర్తి వివరాలు
ప్రస్తుతం రవితేజ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. తదుపరి సినిమాను ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా 1980 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ వుంటాయని అంటున్నారు.

ఇంతకుముందు త్రినాథరావు 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' సినిమాలను హిట్ చేశాడు. అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? వంటి విశేషాలతో పాటు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారట.
Raviiteja
Gopichand Malineni
Nakkina Thrinatha Rao Movie

More Telugu News